ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ అన్నారు. సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన చర్చల్లో డీఏ విడుదల చేయడానికి ఆమోదించినట్లు చెప్పారు. ఉద్యోగులకు ఏ సమస్య వచ్చిన అండగా ఉంటామని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు జావిద్, కార్యదర్శి రవి పాల్గొన్నారు