రాజీవ్ యువవికాసం పథకానికి సిబిల్ స్కోర్ అమలు చేయాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి బాషా డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని అమలు చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.