ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ అన్నారు. సంగారెడ్డిలో బుధవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని బిల్లులను ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జావిద్, కార్యదర్శి రవి పాల్గొన్నారు.