పేద ప్రజల వైద్యం కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డి లోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ 57 మంది లబ్ధిదారులకు 16. 57 లక్షల రూపాయలను అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, చక్రపాణి, మధుసూదన్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.