సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో శనివారం జరిగే భూభారతి సదస్సుకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సంగారెడ్డి కేంద్రంలోని ఐబి వద్ద జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం అధికారులు, మంత్రి భూభారతి కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.