మహిళలపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు ఆయన దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. టీపీసిసీ కార్యదర్శి తో పాజి అనంతకృష్ణ మాట్లాడుతూ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జార్జీ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ నాయకులు పాల్గొన్నారు.