గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని బీరంగూడ సాయిబాబా దేవాలయంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.