

వంతెన కూలిన ఘటనలో 13కి చేరిన మృతుల సంఖ్య
గుజరాత్ వడోదరలో వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. మహిసాగర్ నదిపై వంతెన కూలి వాహనాలు నీటిలో పడిపోవడంతో 13 మంది మరణించినట్టు అధికారులు ప్రకటించారు. 14 మందిని రక్షించామని, వారిలో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు నష్ట పరిహారాన్ని పీఎంవో కార్యాలయం ప్రకటించింది.