సీఎస్ ఆర్ ద్వారా వచ్చిన నిధులు విద్య, వైద్య రంగానికి ఖర్చు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేజీబీవీలు, బాలికల గురుకుల పాఠశాలలో కనీస వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.