జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలోని గోకుల్ గార్డెన్ కన్వెన్షన్ సెంటర్ లో ఆదివారం జరిగిన ఇరిగేషన్ సర్కిల్ మెదక్, ఎఫ్. ఏ. సి. ఇరిగేషన్ సర్కిల్ సంగారెడ్డిగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన బి. యేసయ్య ఆత్మీయ అభినందన సభలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై. నరోత్తం పాల్గొని యేసయ్య దంపతులను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అన్నారు.