సంగారెడ్డి పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో బుధవారం పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కాలనీలో రోడ్లు, మురికి కాలువలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఏరియా కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.