సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

61చూసినవారు
ఆరు రోజులుగా మంచినీటి సరఫరా చేయడం లేదని సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ఆదిత్య నగర్ వాసులు గురువారం ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఏఈ రఘుకు వినతిపత్రం సమర్పించారు. కాలనీ అధ్యక్షుడు సాయిలు మాట్లాడుతూ.. ఆరు రోజులుగా మంచినీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధర్నాలో కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్