సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి లకు జిల్లా ఉత్తమ అధికారి అవార్డును రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సంగారెడ్డిలో అందజేశారు. అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ తమకు జిల్లాస్థాయి అవార్డు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.