
వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏలూరు జిల్లా బాపులపాడు మండలంలో నకిలీ పట్టాల పంపిణీ కేసులో వంశీకి రిమాండ్ విధించడం జరిగింది. గురువారం హనుమాన్ జంక్షన్ పోలీసులువంశీని నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వంశీతోపాటు ఆయన అనుచరుడు రంగాకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.