రోడ్డు కోసం డివైఎఫ్ఐ నాయకుల నిరసన

61చూసినవారు
రోడ్డు కోసం డివైఎఫ్ఐ నాయకుల నిరసన
సదాశివపేట మండలం ఆత్మకూరు నుంచి మాలపాడు వరకు ధ్వంసమైన రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ రోడ్డుపై గుంతలు ఉండడంతో వర్షాకాలంలో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అధికారులు బీటీ రోడ్డు నిర్మించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో నాయకులు పాల్గొన్నారు.