సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మాదాపూర్ గ్రామంలో బుధవారం ఏరువాక పౌర్ణమి పండుగను పురస్కరించుకొని గ్రామంలో రైతులందరూ తమ ఎద్దుల బండిని కట్టుకొని గ్రామంలో బసవన్న మందిరానికి వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. మందిరం చుట్టూ ఎద్దుల బండ్లను తిప్పుకొని పాడి పంటలు మంచిగా పండాలని మొక్కులు మొక్కుకొని ఈ కార్యక్రమం ముగించారు.