తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గాలి అనిల్ కుమార్ నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ కి, ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి, నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు గాలి అనిల్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.