సంగారెడ్డిలో ఘనంగా శ్రీ హనుమాన్ విజయోత్సవ వేడుకలు

78చూసినవారు
సంగారెడ్డిలో ఘనంగా శ్రీ హనుమాన్ విజయోత్సవ వేడుకలు
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్ 32వ వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో శ్రీ హనుమాన్ విజయోత్సవ సంబరాలను అంబరాన్ని తాకే విధంగా శనివారం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నాయికోటి రామప్ప ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి అభిషేకం, సింధూర లేపనం, అలంకరణ గావించి అష్టోత్తర శతనామ స్తోత్ర యుక్తముగా వేలాది మంది భక్తులు తమళదళార్చన జరిపారు. అనంతరం స్వామివారి మహా ప్రసాదంగా అన్న సమర్పణ చేశారు.

సంబంధిత పోస్ట్