సంగారెడ్డిలో హనుమాన్ జయంతి ర్యాలీ

83చూసినవారు
హనుమాన్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ శనివారం నిర్వహించారు. భవాని మందిరం నుంచి పట్టణ పురవీధుల మీదుగా వైకుంఠపురం వరకే ర్యాలీ కొనసాగింది. సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ర్యాలీలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్