సంగారెడ్డి పట్టణంలోని సంజీవని హనుమాన్ మందిరం విద్యుత్ దీపాలతో శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా అలంకరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. శనివారం ఉదయం నుంచి హనుమంతునికి ప్రత్యేక అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు