పిల్లలను ఎక్కడైనా పనిలో పెట్టుకుంటే చైల్డ్ లైన్ నెంబర్ 1098 కు సమాచారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పిల్లల్ని పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు.