సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని శ్రీసీతారామ శివాంజనేయ క్షేత్రంలో వైష్ణవి దేవాలయ ప్రతిష్టాపన వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో మొదటి రోజు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 19వ తేదీన వైష్ణవి దేవతల ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.