సంగారెడ్డి పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి రమేష్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని, బాగా చదివించాలని చెప్పారు.