ఘోరం.. 16 ఏళ్ళ బాలికపై ఏడుగురు అత్యాచారం!
పుదుచ్చేరిలో 16 ఏళ్ళ బాలిక తల్లితో గొడవ పడి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. తర్వాత తనను పర్యాటక స్థలానికి తీసుకెళ్లమని ఓ ఆటో డ్రైవర్ను కోరింది. దీంతో డ్రైవర్ బాలికపై కన్నేసి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి బీచ్ రోడ్డులో వదిలేశాడు. ఆ తర్వాత ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని చెప్పి చెన్నైలోని ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆరుగురు వ్యక్తులు బాలికకు మద్యం తాగించి 2 రోజుల పాటు అత్యాచారం చేశారు. నిందితుల్లో తెలంగాణకు చెందిన రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు.