దేశ అభివృద్ధిలో ఐఐటీ ల పాత్ర కీలకమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కంది లోని ఐఐటీలో యంగ్ సైంటిస్ట్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐఐటీలో చదివిన ఎందరో శాస్త్రవేత్తలుగా ఎదిగినట్లు చెప్పారు. ఎన్నో రకాల ప్రయోగాలు చేసి దేశ అభివృద్ధిలో తమ వంతు కృషి చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఐఐటి ఆవరణ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డైరెక్టర్ మూర్తి పాల్గొన్నారు.