సమస్యల పరిష్కరించాలని కోరుతూ కంది మండలం ఆయుధ కర్మాగారంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ వైద్య కర్మాగారంలో వర్క్ లోడ్ పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.