రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తామని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్ అన్నారు. అఖిల భారత కిసాన్ సభ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని సంఘ భవనం వద్ద జెండాను శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.