రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సంగారెడ్డికి వస్తున్నారని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందిస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.