

టామ్ క్రూజ్‌తో నిహారిక(వీడియో)
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్‌ను సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, నటి నిహారిక లండన్‌లో జరిగిన ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ ప్రీమియర్ షోలో కలిశారు. సినిమా ప్రమోషన్లో భాగంగా పలు దేశాల ఇన్ఫ్లూయెన్సర్లను ఆహ్వానించగా, నిహారిక కూడా హజరయ్యారు. అక్కడ టామ్‌తో ఫొటోలు దిగి.. ఆ అనుభవాన్ని తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. "కలలాగే ఉంది. టామ్‌ను కలవడం నా అదృష్టం" అన్నారు. తాజాగా ఈ వీడియో వైరల్ అవుతోంది.