రేపు అయ్యప్ప దేవాలయంలో ఉత్తర నక్షత్ర వేడుకలు

57చూసినవారు
సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 12వ తేదీన ఉత్తర నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొక్కొండ శ్రీశైలం గురుస్వామి గురువారం తెలిపారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతం, స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, 8 గంటలకు ప్రత్యేక హారతి, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మహా పడిపూజ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. భక్తులు పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you