సంగారెడ్డి పట్టణం లోని శ్రీ నవరత్నాల దేవస్థానంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం ఉత్తర నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం తెలిపారు. ఉదయం 7 గంటలకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, 8 గంటలకు పల్లకీ సేవ, రాత్రి 7 గంటలకు అష్టాదశ సోపాన మహా పడిపూజ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.