న్యాల్‌కల్: సంకష్ట చతుర్థి పూజలు

74చూసినవారు
న్యాల్‌కల్: సంకష్ట చతుర్థి పూజలు
సంకష్ట చతుర్థి పర్వదినం సందర్భంగా బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం రేంజింతల్ లో ఉన్న శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వేకువజామున వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు.

సంబంధిత పోస్ట్