సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రహదారి సమీపంలోని కాలనీలో మంచినీటి సమస్యను అధికారులు పట్టించుకోవడంలేదని ఆదిత్య నగర్ కాలనీ అధ్యక్షుడు సాయిలు ఆరోపించారు. సంగారెడ్డిలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిత్య నగర్, వసంత్ కాలనీ, బర్మా నగర్, ఓడిఎఫ్ కాలనీ, శ్రీనివాస నగర్ లలో గత నాలుగు రోజులుగా మంచినీరు సరఫరా సరిగా జరగడం లేదని చెప్పారు. మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు.