కలెక్టర్ కార్యాలయం ముందు పిడిఎస్ యు ధర్నా

53చూసినవారు
విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్ యు ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్