సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో మీనం మాస పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రదీప్ కుమార్ తంత్రి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరిపించారు. ఆలయంలో హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయ చైర్మన్ కొక్కొండ శ్రీశైలం, కోశాధికారి సాగర్, ఉపాధ్యక్షుడు శేషగిరిరావు, గురుస్వాములు పాండువర్మ, రాధాకృష్ణ, సత్యనారాయణ, వెంకన్న, శ్రీనివాసరావు పాల్గొన్నారు.