జాతీయ రహదారి విస్తరణ కోసం 11 కేవీ వైర్లను మారుస్తున్నందున శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ కోత విధిస్తున్నట్లు ఎఈ ప్రకాష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జంజం దాబా వెనుక వైపు, విజ్ఞాన్ కాలనీ, గేట్ వే, శ్రీ సాయి కాలనీ, మంజీరా ఎంక్లేవ్, శ్రీ బాలాజీ హాస్పిటల్ వెనక భాగంలో విద్యుత్ కోత ఉంటుందని చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు.