సంగారెడ్డి: కలెక్టర్ క్రాంతి వల్లూరు గురువారం బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హన్మకొండ కలెక్టర్ గా పనిచేస్తున్న ప్రావీణ్య జిల్లాకు రానున్నారు. ఇప్పటి వరకు కలెక్టర్ గా పనిచేసిన వల్లూరు క్రాంతిని టూరిజం శాఖ ఎండీగా బదిలీ చేశారు. రాష్ట్రంలో ఒకేసారి 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే వల్లూరు క్రాంతి కూడా బదిలీ అయ్యారు.