సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని భవాని భువనేశ్వరి దేవాలయంలో పూర్వాషాడ నక్షత్ర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించి లలిత సహస్ర పారాయణం చదివారు. భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.