మనూరు మండల పరిధిలోని జడ్. పి. హెచ్. ఎస్ రాయిపల్లి పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు త్రిపుల్ ఐటీ బాసరకు ఎంపికైనందుకు పాఠశాల హెచ్ఎం రాజప్రసన్న అభినందనలు తెలిపారు. రాయిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసించి త్రిపుల్ ఐటీ బాసరకు ఎంపికైన విద్యార్థులు శివాని, నందిని, హష్మతకు పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు.