రాజీవ్ యువ వికాసం గడువు ఈనెల 24వ తేదీ వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎస్సీ కార్పొరేషన్ అధికారి రామాచారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ దరఖాస్తులను ఆన్ లైన్ లో కానీ, నేరుగా మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాలలో కానీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.