భూభారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కొండాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేయాలని పేర్కొన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో తహసిల్దార్ అశోక్ పాల్గొన్నారు.