సదాశివపేట: రేపు అయ్యప్ప స్వామి ఆలయంలో 27వ వార్షికోత్సవం

80చూసినవారు
సదాశివపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో 27వ వార్షికోత్సవం ఈనెల 7న నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ, ధ్వజారోహణం, అభిషేక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. 9 గంటలకు గణపతి హోమం, పుష్పార్చన జరుగుతాయని చెప్పారు. 12 గంటలకు మహా హారతి కార్యక్రమం జరుగుతుందని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్