బిజెపితోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అన్నారు. సదాశివపేటలో పట్టభద్రులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర రావు దేశ్పాండే, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తోట చంద్రశేఖర్, జ ఉపాధ్యక్షుడు మాణిక్యరావు పాల్గొన్నారు.