సదాశివపేట: డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

52చూసినవారు
సదాశివపేట: డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
సంగారెడ్డి జిల్లా సదాశివపేట డిగ్రీ కళాశాలను బుధవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సందర్శించారు. కళాశాలలోని సదుపాయాలపై ఆరా తీసారు. కాలేజీలోని సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నూతన బాలికల హాస్టల్ భవనం, బాలికల ప్రత్యేక విశ్రాంతి గదులు, కాంపౌండ్ వాల్, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్