పదవ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మండల విద్యాధికారి శంకర్ అన్నారు. సదాశివపేట పట్టణంలోని ఉన్నత పాఠశాలను గురువారం అకస్మికంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి చదివించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నిజాముద్దీన్, రవీంద్రనాథ్, రాజు పాల్గొన్నారు.