కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వికలాంగుల ప్రజావాణి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది వికలాంగులు తమ సమస్యలను విన్నవించారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారికి ఆదేశాలు ఇచ్చారు. ప్రదేశం మొదటి శనివారం వికలాంగుల కోసం ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.