సంగారెడ్డి మున్సిపాలిటీలో వందల రోజుల ప్రణాళికా కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూన్ 2న ప్రారంభమైన కార్యక్రమం సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. వాటిలో శానిటేషన్ కార్యక్రమం, సేంద్రియ ఎరువు తయారు చేయడం మొక్కలు పెంచడం, వంటి కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు.