సంగారెడ్డి: 27న ఏఐటీయూసీ జిల్లా మహాసభ

1చూసినవారు
సంగారెడ్డి: 27న ఏఐటీయూసీ జిల్లా మహాసభ
ఏఐటియుసి జిల్లా మహాసభ ఈ నెల 27వ తేదీన సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. సంగారెడ్డి లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహాసభలో కార్మికుల సమస్యలపై చర్చ జరుగుతుందని చెప్పారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్