సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రజలకు మంచినీరు అందించేందుకు 44 కోట్లతో అమృత జల పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అమృత్ మంచినీటి పథకానికి శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, జంపి రఘునందన్ రావు, కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.