ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సంఘ భవనంలో చేగువేరా జయంతి ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ చేగువేరా స్ఫూర్తితో విద్యార్థుల సమస్యలపై ఉద్యమిస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.